శక్తి యాప్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

SKLM: శక్తి యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన అవసరమని టెక్కలి డివిజన్ శక్తి టీం సభ్యుడు నారాయణరావు తెలిపారు. సోమవారం నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో శక్తి యాప్ పట్ల విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు శక్తి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.