ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై కురుపాం ప్రజలకు అవగాహన

ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై కురుపాం ప్రజలకు అవగాహన

PPM: కురుపాంలో పలు షాపులు వద్ద డిప్యూటీ ఎంపీడీవో జి.రమేశ్ బాబు శనివారం ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కూడా వారి షాపులు, ఇంటి వద్ద నుంచి వచ్చే వ్యర్థాలను వేరువేరుగా సంచుల్లో వేసి పీడబ్ల్యూఎం యూనిట్‌కు తరలించేందుకు అందరు సహకరించాలన్నారు. వేరువేరు సంచిల్లో ఎలా వ్యర్థాలు వేయాలో ప్రజలకు అవగాహన కల్పించారు.