క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే
ADB: నెరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన మేగా క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. యువకులు తీవ్రమైన ఎండల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ క్రీడల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. యువకులు క్రీడాలతో పాటు చదువులో రాణించాలన్నారు.