రాజస్థాన్‌లో SIR విధుల్లో విషాదం

రాజస్థాన్‌లో SIR విధుల్లో విషాదం

బెంగాల్‌లో SIR అధికారులపై దాడులు జరుగుతున్న వేళ.. రాజస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కోట్‌పుత్లీలో ఓటర్ లిస్ట్ డ్యూటీలో ఉన్న బీఎల్‌వో విజయ్ గుర్జార్(42) ఆకస్మికంగా మృతి చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో జరిగిన ఈ ఘటన ఉద్యోగులను కలచివేసింది.