బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్‌పై క్షిపణి దాడి

బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్‌పై క్షిపణి దాడి

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం ప్రాంగణానికి సమీపంలో క్షిపణి దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. ఇటీవలి కాలంలో ఇది నాలుగో ఘటన అని పేర్కొంది. ఈ క్షిపణి శకలం తగిలి సిబ్బందిలో ఒకరు చనిపోయారని తెలిపింది. ఆ ప్రాంతంలోని భవనం దెబ్బతిన్నట్లు వివరించింది. ఈ ఘటనలో న్యూక్లియర్ ప్లాంట్‌లో ఎటువంటి రేడియేషన్ లీక్ కాలేదని స్పష్టం చేసింది.