పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ: కలెక్టర్
JGL: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.