VIDEO: 'మాత, శిశు మరణాలు జరగకుండా వైద్య సేవలు అందించండి'

SKLM: ప్రభుత్వ ఆసుపత్రులలో మాత,శిశు మరణాలు కలగకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశించారు. పోలాకి ప్రభుత్వ హాస్పిటల్‌లో అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందించడంతోపాటు వారితో మమేకమై సేవలు అందించాలని సూచించారు.