పురాతన ఆంజనేయస్వామి ఆలయానికి భూమిపూజ

పురాతన ఆంజనేయస్వామి ఆలయానికి భూమిపూజ

WNP: అమరచింత మున్సిపాలిటీలోని పురాతన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం పునర్నిర్మాణానికి గురువారం భూమిపూజ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి డా. వాకిటి శ్రీహరి, రూ. 50 లక్షల నిధుల ప్రొసీడింగ్‌లను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆలయ పునర్నిర్మాణానికి హామీ ఇచ్చిన మంత్రి, తన మాట నిలబెట్టుకున్నారు.