VIDEO: బీజేపీ ముట్టడిలో ఆసక్తికర పరిణామం

HYD: సచివాలయం బీజేపీ ముట్టడిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్త అనుకొని కాంగ్రెస్ నాయకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నేను ఎంపీ మనిషిని అని కాంగ్రెస్ కార్యకర్త పోలీసులకు చెప్పారు. ఎంపీతో దిగిన ఫోటోలు చూపిన అనంతరం పోలీసులు వదలడంతో కాంగ్రెస్ కార్యకర్త నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.