నేడు సైన్స్ కళాశాల తరగతులు ప్రారంభం

నేడు సైన్స్ కళాశాల తరగతులు ప్రారంభం

NZB: TUలో నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణం పూర్తయి, ఇటీవలే వర్చువల్ వేదికగా సీఎం ప్రారంభించిన నేపథ్యంలో కార్యకలాపాలను కొనసాగించేందుకు నేటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ సిబ్బంది హాజరుకావాలని పేర్కొన్నారు.