'ఈ విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనం'
TG: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధ అభ్యర్థులే గెలుపొందడం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.