'ఎకరాకు 35 క్వింటాళ్లు మొక్కజొన్న కొనుగోలు చేయాలి'
KNR: గన్నేరువరం మండలంలో మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 35 క్వింటాళ్లకు పెంచాలని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. 26 క్వింటాళ్ల వరకే కొనుగోలు జరుగుతుండడంతో మిగిలిన ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని రైతుల ప్రయోజనార్థం పరిమితి పెంచాలని కోరారు.