'పెద్ది' డబ్బింగ్ మొదలుపెట్టిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' కోసం డబ్బింగ్ పనులు మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుతో చరణ్ సరదాగా జోకులు వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి రెండో సాంగ్ 'రై రై రారా'ను రేపు విడుదల చేయనున్నారు. ఉత్తరాంధ్ర క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చరణ్ 'ఆట కూలీ'గా సందడి చేయనున్నారు.