కుప్పకూలిన డ్రోన్.. భయాందోళనలో ప్రజలు
AP: అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా జి మాడుగుల మండలం బొయితిలి ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా డ్రోన్ కూలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెడ్ వింగ్ సంస్థ, ప్రభుత్వం సంయుక్తంగా డ్రోన్ సేవలను పరిశీలిస్తున్నాయి. రక్తం నమూనాలు, అత్యవసర మందులను వేగంగా తరలించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ ట్రయల్ రన్ చేపట్టారు. ఈ క్రమంలో డ్రోన్ చెట్లపై పడింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.