చోరీ కేసులో ఐదు మంది ముద్దాయిలు అరెస్టు

NDL: కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో సోమవారం నాడు సీఐ రమేష్ బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంజామల నుండి కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వరకు నూతనంగా రైల్వే లైన్ పనులను ప్రారంభించారు. ఈ మేరకు మీర్జాపురం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు రైల్వే లైన్ కాపర్ వైర్‌ను చోరీలు చేస్తుండేవారు. కాగా, పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.