'వరద ఉధృతితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

కోనసీమ: గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆలమూరు మండలంలోని వరద ప్రభావిత గ్రామాలైన బడుగు వానిలంక, మూలస్థానం గ్రామాలను రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై నరేష్ సిబ్బందితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. అక్కడ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.