'పరీక్షలకు క్రమబద్ధమైన సిద్ధత అవసరం'

'పరీక్షలకు క్రమబద్ధమైన సిద్ధత అవసరం'

VSP: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. గురువారం జీవీఎంసీ హైస్కూల్, కె.ఎన్.ఎం. గర్ల్స్ హైస్కూళ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. స్లిప్ టెస్టులు, 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు.