ఓటర్ల నమోదుకు సహకరించండి: కలెక్టర్
వనపర్తి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఎస్.ఐ.ఆర్.పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.