తాను చనిపోతూ 8 మందికి అవయవదానం
GDWL: అయిజకు చెందిన నాగరాజు కుమారుడు విష్ణు చైతన్య రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. మరణానంతరం అతడి ఎనిమిది ప్రధాన అవయవాలు, 50కి పైగా టిష్యూ విభాగాలు దానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచాడని కుటుంబీకులు తెలిపారు. విద్యార్థి అంత్యక్రియలు ఆదివారం అయిజలో నిర్వహించనున్నారు.