TNTUC ఆధ్వర్యంలో 'కార్మికబాట' కార్యక్రమం

TNTUC ఆధ్వర్యంలో 'కార్మికబాట' కార్యక్రమం

MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఖైరీ గూడ ఓపెన్ కాస్ట్‌లో TNTUC ఆధ్వర్యంలో శనివారం 'కార్మికబాట' కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చాలని, పెరిక్స్‌పై IT మినహాయింపు ఇవ్వాలని కోరారు. మారు పేర్ల మార్పిడి సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు.