VIDEO: జిల్లాలో పంజా విసిరిసన పొగమంచు

VIDEO: జిల్లాలో పంజా విసిరిసన పొగమంచు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం పొగమంచు కురిసింది. పుంగనూరు మండలంలో పొగమంచు ధాటికి రోడ్లు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. లైట్లను వేసుకుని రాకపోకలు సాగించారు. సమయం 7 గంటలు అయినా పొగమంచు వీడకపోవడంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. మరోవైపు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని.. మెల్లగా వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచనలు ఇచ్చారు.