VIDEO: వెలుగొండ జలాల సాధన సదస్సుపై ప్రచారం
ప్రకాశం: కనిగిరిలో ఈ నెల 23న జరిగే వెలిగొండ జలాల సాధన సదస్సుకు నియోజకవర్గ ప్రజలు తరలి రావాలని CPM పట్టణ కమిటీ సభ్యులు జి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన కనిగిరి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార జాత కార్యక్రమం నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి 28 సంవత్సరాలైనా ఇంకా పూర్తి చేయలేకపోతున్నందుకు పాలకులు సిగ్గు పడాలన్నారు.