'మహిళా సాధికారతే సమాజాభివృద్ధికి పునాది'
మహబూబ్ నగర్: అంబేడ్కర్ చౌరస్తా వద్ద 'ఇందిర మహిళా శక్తి' గ్రామ దుకాణాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి దుకాణాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.