ఖమ్మం జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులేవి..?

KMM: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాహన రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు విస్తరిస్తున్నాయి. అన్ని రకాల విభాగాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. TGSRTC కొన్ని జిల్లాలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. కానీ KMM జిల్లాలో మాత్రం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టలేదు. జిల్లాలో సరైన సాంకేతిక సదుపాయాలు లేకపోవడంతో ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయానికులు కోరారు.