రైలు కిందపడి కానిస్టేబుల్ మృతి

MHBD: పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కదులుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ హరిప్రసాద్ (32) మృతి చెందారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.