సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా.. నీలం యువరాజ్

JN: జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నీలం యువరాజ్ నియమితులయ్యారు. ఆదివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. యువరాజ్ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.