ముగిసిన కుష్టు వ్యాధి నిర్మూలన అవగాహన సదస్సులు

ముగిసిన కుష్టు వ్యాధి నిర్మూలన అవగాహన సదస్సులు

CTR: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకారం అవసరమని అర్బన్ PHC డాక్టర్ కిరణ్మయి అన్నారు. మహాత్మ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా జనవరి నుంచి ప్రారంభించిన అవగాహన సదస్సులు, ప్రత్యేక సర్వే శుక్రవారంతో ముగిసింది. పుంగనూరు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది సదస్సులు, ర్యాలీలు నిర్వహించి కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు.