VIDEO: వెంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు
KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఆలయ ఈవో ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి గత 4 నెలలకుగాను రూ. 2,42,604 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.