VIDEO: రహదారిపై అడవి పందులు మృతి

VIDEO: రహదారిపై అడవి పందులు మృతి

NZB: జానకంపేట- నవీపేట రహదారిపై నిన్న సుమారు 6 అడవి పందులు మృత్యువాత పడ్డాయి. జానకంపేట శివారులోని కారం గిర్ని, సురేష్ దాబా మధ్య రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అడవి పందులు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. గుంపుగా రహదారిని దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టడంతో అవి మరణించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.