బాధితుల చెంతకే పోలీస్ సేవలు

బాధితుల చెంతకే పోలీస్ సేవలు

సూర్యాపేట మండలం ​అంజనాపురి కాలనీలో యువకుల ఘర్షణపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు తక్షణమే స్పందించారు. ఎస్సై వెంకట్‌రాములు బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి, అక్కడే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని ఈరోజు అందజేశారు. స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా బాధితుల వద్దకే వెళ్లి సేవలు అందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.