హాస్టల్ బుకింగ్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
TG: HYDకు వచ్చే మహిళల వసతి, భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త యాప్‌ను తీసుకువస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ, గుర్తింపు పొందిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో గదులను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. CCTVలు, పటిష్ఠ భద్రతతో కూడిన వసతిని కల్పించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం. తమిళనాడులో విజయవంతమైన ఈ విధానాన్ని పరిశీలించిన అధికారులు, త్వరలోనే ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.