మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో రష్మిక..?

మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో రష్మిక..?

విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి రష్మిక మందన్న.. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనుదీప్ KV రష్మిక కోసం కథను సిద్ధం చేశాడట. త్వరలోనే ఆమెకు వినిపించనున్నట్లు టాక్. అయితే తన గత మూవీల తరహాలో కామెడీ కాన్సెప్ట్‌తో కాకుండా ఎమోషన్స్‌తో కూడిన కథను అనుదీప్ రెడీ చేశాడట. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం.