VIDEO: అయినవిల్లిలో భారీ వర్షం

VIDEO: అయినవిల్లిలో భారీ వర్షం

కోనసీమ: అయినవిల్లి మండల వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి సాయంత్రానికి మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే వ్యవసాయదారులు, కూలీ పనులకు వెళ్ళిన వాళ్ళు, వాహనదారులు ఈ వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.