VIDEO: శివాలయంలో కార్తీక దీపారాధన
KME: మద్నూర్ మండల కేంద్రంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా సోమలింగాల గుట్ట ఆలయం, మల్లేశ్వర మందిరం, బాలాజీ ఆలయంలో తెల్లవారుజామున నుంచి మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శివలింగాల చుట్టూ దీపాలతో అలంకరించారు. ఆలయ పూజారి కార్తీక మాసం విశిష్టత గురించి వివరించారు. అనంతరం భక్తులు ఉసిరికాయలపై దీపాలతో హరతి ఇచ్చారు.