పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
సత్యసాయి: నల్లమాడ మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చారుపల్లి, బడవాండ్లపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కూటమి నాయకులు, అధికారులతో కలిసి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.