కడుపునొప్పితో విద్యార్థి మృతి

కడుపునొప్పితో విద్యార్థి మృతి

MNCL: కడుపునొప్పితో విద్యార్థి చనిపోయిన ఘటన నెన్నెల(M) అవుడం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాద్​ వివరాల ప్రకారం..  వర్షిత్​సాయి తెల్లవారు జామున 3 గంటలకు తీవ్ర కడుపునొప్పి వస్తుందని పేరెంట్స్‌కు చెప్పడంతో స్థానిక పీఎంపీ వద్దకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యానికి కరీంనగర్​కు అంబులెన్స్​లో తరలిస్తుండగా మార్గ మధ్యలో వర్షిత్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.