మంత్రి దామోదరకు బిగ్ షాక్
MDK: మంత్రి దామోదర రాజ నర్సింహాకు బిగ్ షాక్ తగిలింది. ఆయన దత్తత గ్రామం నేరడిగుంట గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అతడిపై BRS బలపరిచిన అభ్యర్థి సాయికుమార్ ఏకంగా 502 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. ఈ గెలుపు పట్ల గ్రామ BRS నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.