డా. రాజ వర్ధన్ రెడ్డికి ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు

డా. రాజ వర్ధన్ రెడ్డికి ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు

WNP: లీడ్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన “లీడ్ ఇండియా 2047 విశ్వ గురు భారత్” కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా డా. ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డికి ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు అందజేశారు. విద్యా రంగంలో నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తూ గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఆయన విశేష కృషి చేసినందుకు ఈ పురస్కారం లభించిందన్నారు.