ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో లక్ష్యసేన్

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో లక్ష్యసేన్

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్‌లో ప్రపంచ నెం.6 చౌ టెయిన్‌పై 17-21, 24-22, 21-16 తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్‌లో వెనుకబడ్డా, ఆ తర్వాతి రెండు గేముల్లో అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈరోజు జరిగే ఫైనల్‌లో జపాన్‌కు చెందిన యుషి టనాకతో తలపడనున్నాడు.