మూడు రోజులుగా నిలిచిన ఈ-ఛావణి పోర్టల్
HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెందిన ఈ-ఛావణి పోర్టల్ గత మూడు రోజులుగా పనిచేయక పోవడంతో రెవెన్యూ లావాదేవీలు నిలిచిపోయాయి. పన్నులు, ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. సేవలు పునరుద్ధరించే వరకు ప్రజలు ప్రత్యక్షంగా ఎస్‌సీబీ కార్యాలయాలను సందర్శించాలని స్థానిక బోర్డు అధికారులు సూచించారు.