VIDEO: SFI ఆధ్వర్యంలో MLA క్యాంపు ఆఫీస్ ఎదుట నిరసన
MNCL: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో బెల్లంపల్లి MLA క్యాంప్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నాయకులు సోమవారం నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించి విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు