2029లో వైఎస్ జగనే ముఖ్యమంత్రి : కొడాలి నాని
AP: YCP అధినేత YS జగన్ 2029లో CM కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. మాజీమంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి మాట్లాడారు. 'కూటమి బెదిరింపులకు వైసీపీ శ్రేణులు భయపడరు. టీడీపీ నేతలు కావాలనే అంబటిని రెచ్చగొట్టారు. ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైసీపీ భయపడదు’ అని పేర్కొన్నారు.