'ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలి'
ADB: గుడిహత్నూరు మండలంలోని దంపూరు ప్రాథమిక పాఠశాలలో సామాజిక కార్యకర్త ఆడే జైపాల్ విద్యార్థులకు గురువారం స్వెటర్లను పంపిణీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది ఆయన్ను శాలువాతో సత్కరించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని ప్రధానోపాధ్యాయుడు అంబారావు అన్నారు.