గుకేశ్‌ను చూసి గర్విస్తున్నాం: ప్రసాద్

గుకేశ్‌ను చూసి గర్విస్తున్నాం: ప్రసాద్

CTR: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో 18 ఏళ్ల గుకేశ్.. చైనాకు చెందిన 32 ఏళ్ల క్రీడాకారులతో పోరాడి గెలిచిన తీరును చూసి గర్విస్తున్నామని ఏపీ చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. ఆయన శనివారం అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గుకేశ్ చిత్తూరు ఉమ్మడి జిల్లా వాసి కావడం ఆనందంగా ఉందన్నారు.