'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

MNCL: భారీ వర్షాల నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో రోడ్లపై వరద నీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే ప్రధాన రహదారికి ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామని వెల్లడించారు.