చెరుకు పంట దగ్ధం
SRCL: ప్రమాదవశాత్తూ ఓ రైతుకు చెందిన చెరుకు పంట అగ్నికి ఆహుతైన సంఘటన బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి లక్ష్మిపతి గౌడ్‌కు చెందిన ఐదు ఎకరాల చెరుకు పంట అగ్నికి దగ్ధంమైంది. దీంతో రైతుకు దాదాపు ఐదు లక్షల నష్టం వాటిల్లింది. కాగా, ఈ ఘటన ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది.