రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
BPT: చెరుకుపల్లి మండలం నడింపల్లిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. జాతీయ రహదారి (NH-216) దాటుతున్న దాసరి ప్రసాద్‌ను, చెరుకుపల్లి వైపు నుంచి వస్తున్న బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్‌కి కాళ్లు విరిగి తీవ్ర గాయాలవ్వగా, బైక్ నడుపుతున్న శివన్నారాయణకు కూడా గాయాలయ్యాయి. వీరిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.