VIDEO: పచ్చని కొండల నడుమ జలపాతం

ASR: కొయ్యూరు మండలం లింగాపురం సమీపంలో కొండల మధ్య ఉన్న జలపాతం పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. గోపవరం నుంచి బాహుబలి కొండ అంచుకు వెళితే ఈ జలపాతం వద్దకు చేరుకోవచ్చు. జలపాతం చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు, కొండలను ఆనుకుని పాల నురుగును తలపించే మేఘాలతో ఆ పరిసరాలు ప్రకృతి రమణీయ దృశ్యాలు ఆహ్లాదం కలిగిస్తాయి. రహదారి సౌకర్యం కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు తెలిపారు.