ఈ నెల 11న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష

ATP: రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మే 11న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాదులోని ఇండో అమెరికన్ బసవతారకం ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఆధ్వర్యంలో వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.