VIDEO: తంటికొండ గ్రామంలో వరుస దొంగతనాలు
E.G: తంటికొండ గ్రామంలో దొంగలు వరుస చోరీలతో హల్‌చల్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి స్థానిక మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయ హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కేవలం గుడిలోనే కాకుండా, గత కొద్ది రోజులుగా గ్రామంలో 4 మేకలు, 2 గేదెలను కూడా గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.